Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్రికెట్ బాగా ఆడ‌తాను, స‌పోర్ట్ చేయి అన్న అని వేడుకున్న అభిమాని..

    Author VENKATESH | 13 Jul 2026, 10:46 AM | Cinema
    క్రికెట్ బాగా ఆడ‌తాను, స‌పోర్ట్ చేయి అన్న అని వేడుకున్న అభిమాని..

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తనను అభిమానించే వారి పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజ‌య్ స్టేడియానికి చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు, కలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.Geographic Reference
    అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. స్టేడియంలో ఉన్న ఓ యువ అభిమాని విజయ్ దేవరకొండను చూడగానే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆవేశాన్ని ఆపుకోలేక ఆయన దగ్గరకు వెళ్లి, “అన్నా… నేను చాలా బాగా క్రికెట్ ఆడతాను. కానీ నాకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం లేవు. నువ్వు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అన్నా” అంటూ వేడుకున్నాడు. ఆ పరిస్థితిని గమనించిన విజయ్ దేవరకొండ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువకుడి వద్దకు వెళ్లి అతన్ని గుండెలకు హత్తుకుని ఓదార్చారు. అనంతరం అతనితో కొంతసేపు మాట్లాడి, వ్యక్తిగత వివరాలు, కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. క్రికెట్‌లో ఎదగాలనే అతని కలను గౌరవిస్తూ, తనవంతు సహాయం అందిస్తానని, భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు అక్కడున్న వారు తెలిపారు.