క్రికెట్ బాగా ఆడతాను, సపోర్ట్ చేయి అన్న అని వేడుకున్న అభిమాని..
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసుతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ తనను అభిమానించే వారి పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయతతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నమెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్ స్టేడియానికి చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు, కలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.Geographic Reference అయితే...