Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేనేత సహకార సంఘం ప్రతినిధుల మర్యాదపూర్వక భేటీ: అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు

    Author VENKATESH | 11 Jul 2026, 08:43 PM | నల్గొండ
    చేనేత సహకార సంఘం ప్రతినిధుల మర్యాదపూర్వక భేటీ: అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు

    దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘం నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో చేనేత సహకార సంఘం చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన చేరుపల్లి బాలరాజు, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చేనేత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి చర్చించారు. తమ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్ చేరుపల్లి బాలరాజును, ఇతర డైరెక్టర్లను ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శాలువాలతో సత్కరించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "సహకార సంఘం సభ్యులు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. చేనేత సహకార సంఘం అభివృద్ధికి నూతన డైరెక్టర్లు చిత్తశుద్ధితో కృషి చేయాలి" అని సూచించారు.
    ​ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత,మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, పగిడిమర్రి రఘురాములు, గుర్రం నిరంజన్, సిరిపోతు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.