చేనేత సహకార సంఘం ప్రతినిధుల మర్యాదపూర్వక భేటీ: అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు

దేవరకొండ 11జూలై (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘం నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు మరియు కార్యవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించి, తమ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో చేనేత సహకార సంఘం చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన చేరుపల్లి బాలరాజు, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చేనేత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంఘం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, చేనేత రంగం బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి...