Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జనాభా అదుపు ప్రగతికి పురోగతికి మదుపు

    Author VENKATESH | 10 Jul 2026, 08:22 PM | కరీంనగర్
    జనాభా  అదుపు  ప్రగతికి పురోగతికి మదుపు

    (జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా )
    జనాభా విస్పోటనం
    అణువిస్పోటనం కన్న ప్రమాదం
    పెరుగుతున్న జనాభా తరుగుతున్న
    వనరులు తగ్గుతున్న జీవన నాణ్యత
    పెరుగుతున్న ఆకలి పేదరికం హింస నిరుద్యోగం ఆర్థిక సామాజిక అసమానతలు
    తరుగుతున్న విధ్య వైద్యo ప్రజారోగ్యం పెరుగుతున్న ఆకలి చావులు అల్ప పౌష్ఠికాహారం బాల కార్మికులు వలసలు లింగవివక్ష హత్యలు ఆత్మహత్యలు శాంతి భద్రతలు గృహ వసతి కొరత తాగు నీరు సాగు నీరు‌ మౌలిక వసతులు అవస్థాపన రవాణ సమాచార సౌకర్యాల కొరత రాజ్యమేలుతుంది
    పెరుగుతున్న జనాభా తరుగుతున్న
    జీవ వైవిద్యం పర్యావరణం జీవావరణం ప్రకృతి సమతౌల్ల్యత
    పరుగెడుతున్న పట్టణీకరణ
    పారిశ్రామికీకరణ ప్లాస్టిక్ వినియోగం ప్రకృతి విద్వంసం కల్తీ ఉత్పత్తులు
    పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం
    వైరస్ ల విజృంభణతో మృత్యువాత పడుతున్న మానవ జాతి
    జనాభా ఉద్రుతితో సహజ వనరుల పై ఒత్తిడి పెరిగి మానవ వనరుల వికాస నిరోధకశక్తిగా పరిణమించి ప్రగతికి పతనానికి చోదక శక్తియై వృధ్దిని అభివృధిని ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే దిక్సూచియై ఆర్థిక వ్యవస్థ దశ దిశ
    నిర్దేశించే శక్తి అవుతుంది జనాభా
    దేశ జనాభా మన దేశ సంపద
    ప్రజల జీవన నాణ్యత జీవన ప్రమాణాలు ఆర్థిక సౌస్టత
    స్వయం స్వమృధ్ది స్వావలంబన
    సుస్థిరాభివృధ్ది జనాభా స్థిరత్వం
    అభిలషణీయ వనరులతో
    పెట్టుబడి మూలధన ఉధ్ధీపనతో
    ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉత్పాదకత ఉపాధి ఆదాయ సృష్టకి శ్రామిక వనరులను సమకూర్చే పరిమిత
    జనాభా అభివృద్ధికి సాధనం
    జనాభా రెండు వైపుల పదను వున్న
    కత్తి లాంటిది పాలకులకు జనాభా వినియోగంలో వివేకం విజ్ఞత మొగ్గ తొడుగాలి
    జన సంక్షేమం అభివృద్ధికి జనాభా నియంత్రణ మార్గం కావాలి
    మానవ అవసరాలు కోరికలు ప్రయత్నాలు సంతృప్తి సమకూర్చే
    జనాభా అభిలషణీయం
    సహజ.వనరుల మానవ వనరుల అభివృద్ధికి మధ్య సమన్వయ సాధనoగా వుండే జనాభా అదుపు
    దేశ ప్రగతికి పురోగతికి మానవ
    మనుగడకు పరమ పద సోపానం
    ప్రభుత్వాలు దేశ వనరులు జనాభా
    పెరుగుదల ఆర్థికాభివృద్ధి మధ్య
    సమన్వయ అభివృధి వ్యూహాలతో
    జనాభా పెరుగుదల దేశానికి శాపంగా
    కాకుండా వరంగా పరిణమించే
    కార్యాచరణకు ఉద్యమించాలి
    శ్రమ శక్తి అభివృద్ధికి సాధనం కావాలి
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరమ్
    సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
    కరీంనగర్9440245771