Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి సంస్కారంతో

    Author VENKATESH | 09 Jul 2026, 09:08 PM | కరీంనగర్
    ఓ మనిషి సంస్కారంతో

    సమాజాన్ని సంస్కరించు
    మనిషికోర్కెలసాధన కొరకు
    వ్యూహాలు ప్రతివ్యూహాలు
    పన్నుతుంటాడు
    ఓ మనిషి కక్షతో కాదు కరుణతో
    మేలుకో నిన్ను పడధోయాలని
    చూసేశత్రువుకు నీఎదుగుదలే
    సమాధానం కావాలి
    నిన్ను తొక్కేయాలని చూసే
    కుటిల శక్తుల ముందు
    నువ్వు నీతి నిజాయితీతో
    నిలబడు నిన్ను నిందించే
    నోరు నీసంస్కారం చూసి
    మూతపడాలి
    కుటిల కుట్ర కుతంత్రాల
    వ్యూహాలను చేధిస్తూ
    నీవు ప్రచండ బానుడివై
    ఉదయించాలి
    నీ పతనాన్ని కోరుకున్న
    క్రూర శక్తుల ఆటకట్టించాలి
    సమరశంఖాన్ని పూరించి
    ప్రళయకాల అగ్నివై రగులు
    వెన్నుపోటు పొడిచే వారికి
    నీ ప్రగతిని అడ్డుకునే శత్రు
    మూకలకు కత్తితో కాదు
    నీకరుణతో గెలువు
    పగతో కాదునీప్రతిభతో నిలువు
    నిన్ను ద్వేషించే వాడు సైతం
    లోలోన నీలా బ్రతకాలని
    ఆరాటపడాలి
    నిందలకు వెరువకు విమర్శలకు
    కుంగకు విజయాల కోటను
    నిర్మించు స్పూర్తి శిఖరమై నిలువు
    నిన్ను ముంచాలని చూసిన
    అలలపై ధైర్యంగా రారాజులా
    ప్రయాణించు
    నీఅడుగుల చప్పుడు
    మృత్యు ఘోషై ప్రతిధ్వనించాలి
    కుట్రల కారు చీకట్లను చీల్చే
    వజ్రాయుధమై కీర్తి శిఖరాగ్రన
    నీవిజయకేతనం ఎగరాలి
    సవాళ్లు రణ రంగంలో
    నిన్ను ముంచాలని చూస్తే
    నువ్వు రౌద్రకార ఉప్పెనవై
    వారిని ముంచెత్తు
    నిందల రాళ్లను పునాదిగా
    మార్చుకుంటూ నీసంకల్ప
    భలంతో కీర్తి శిఖరాలపై
    నీజెండా ఎగరేయాలి
    కత్తినిపట్టిన వాడు వీరుడు కాలేదు
    పగతో రగిలే వాడు విజేత కాలేడు
    కత్తితో కాదు నీ కర్తవ్య దీక్షతో
    గెలువు పగతో కాదు నీ ప్రచండ
    విక్రమంతో నిలువు
    నిన్ను ద్వేషించే శత్రువు సైతం
    నీ తేజస్సు చూసి భయంతో
    సాగిలపడి శరణు వేడాలి
    నీ పతనమే పరమావధిగా బ్రతికే
    వారికి నీ నిరంతర ఎదుగుదలే
    నిత్య నరకం కావాలి
    శత్రువుల ముందు శిఖరమై
    గంభీరంగా నిలబడు
    నువ్వు జీవించే ఉజ్వలమైన
    ప్రతిక్షణం శత్రువుల పాలిట
    శాశ్వత శాసనం కావాలి
    నిన్నుద్వేషించే వాడు
    నీనీడనచేరి తలవంచి
    నిస్సహాయుడై శరణువేడాలి
    అసూయతో రగిలిపోయే శత్రువుల
    ముందు నీ నిశ్శబ్ద సంస్కారమే
    సమాధానం కావాలి
    నువ్వు సమాజ ప్రగతికి
    పురోగతికి వారధి కావాలి
    ఆపదలో ఉన్నవారికి సహాయ
    హస్తం అందించే పరోపకారమే
    నీ‌ జీవనశైలి కావాలి
    నీ ఎదుగుదలను చూసి పగవారు
    సైతం పశ్చాత్తాప పడాలి
    నువ్వు చూపిన మానవత్వం
    వెలుగులో క్రూరత్వం కుటిలత్వం
    కుతంత్రాలు కూలిపోవాలి
    ఆదరణ ఆత్మీయత అవగాహన
    సమత మమత మానవీయతతో
    సమాజ సంస్కరణ మహోద్యమ
    యజ్ఞంలో పౌరులు భాగస్వాములై
    భావిభారత భాగ్యోదయానికి
    బాటవేయాలి
    ఓ మనిషి? శత్రువును
    సైతం మిత్రుడిగా మార్చేలా
    ఒక గొప్ప సంస్కారశీలివై
    నువ్వు జీవించి చూపించు
    ఆయుధంతో లొంగదీసుకుంటే
    శత్రువు తాత్కాలికంగా
    మాత్రమే లొంగుగుతాడు
    కానీ నీసంస్కారం క్షమాగుణం
    నిరుపమానమైన మానవత్వంతో
    లొంగదీసుకునే శత్రువు శాశ్వతంగా
    మారిపోతాడు.
    పగకు ప్రతీకారం పగ కాదు.
    శత్రువు కూడా పశ్చాత్తాపడేలా
    జీవించడమే నిజమైన
    మానవ విజయం
    ఓపిక సహనంతో
    విద్వేషాల అగ్నికీలలు
    అంతం చేద్దాం
    హింసా రహిత సమాజ
    నిర్మాణానికి ఉద్యమిద్దాం.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
    కాలమిస్ట్
    కరీంనగర్9440245771