Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘మైసా’ కోసం రష్మిక సాహసం..

    Author VENKATESH | 09 Jul 2026, 11:04 AM | Cinema
    ‘మైసా’ కోసం రష్మిక సాహసం..

    స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రం మైసాతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మేకర్స్ వెల్లడించిన అప్‌డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. ఆమె కెరీర్‌లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ రోల్స్‌లో ఒకటిగా నిలవనుందని టాక్ వినిపిస్తోంది.
    తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ను మేకర్స్ పంచుకున్నారు. చిత్రంలో అత్యంత కీలకమైన అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను రష్మిక విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ సన్నివేశం కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుని షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. నీటిలో చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ సినిమా మొత్తంలోనే హైలైట్‌గా నిలుస్తుందని, ఇప్పటికే చిత్రీకరించిన విజువల్స్ అద్భుతంగా వచ్చాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ‘మైసా’ ఆరో ప్రధాన షూటింగ్ షెడ్యూల్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన సన్నివేశాలను త్వరలో పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారని సమాచారం.