‘మైసా’ కోసం రష్మిక సాహసం..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ నేషనల్ క్రష్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక చిత్రం మైసాతో వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా మేకర్స్ వెల్లడించిన అప్‌డేట్ ఆ ఆసక్తిని మరింత పెంచింది. నూతన దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న ఇప్పటివరకు ఎప్పుడూ చేయని ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే...