Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జోగులాంబ జోన్–7 పోలీస్ డ్యూటీ మీట్‌లో నారాయణపేట జిల్లా పోలీసుల ప్రతిభ...

    Author VENKATESH | 07 Jul 2026, 06:06 PM | Array
    జోగులాంబ జోన్–7 పోలీస్ డ్యూటీ మీట్‌లో నారాయణపేట జిల్లా పోలీసుల ప్రతిభ...

    - పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు కైవసం
    నారాయణపేట, జూలై 7 (బి వి కె న్యూస్)
    మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 6,7 వ తేదీన నిర్వహించిన జోగులాంబ పోలీస్ జోన్–7 పోలీస్ డ్యూటీ మీట్లో నారాయణపేట జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు.
    వృత్తిపరమైన నైపుణ్యం, శిక్షణ, అంకితభావానికి నిదర్శనంగా నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది వివిధ సాంకేతిక, దర్యాప్తు, ప్రత్యేక విభాగాల్లో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచారు.
    విజేతల వివరాలు వీరే.......
    క్రైమ్ ఇన్వెస్టిగేషన్ & క్రిమినల్ లాస్ విభాగంలో – ఎస్‌ఐ కృష్ణ (ఎస్‌.ఎం. నవీద్) ద్వితీయ స్థానం సాధించారు.
    ఫోటోగ్రఫీ విభాగంలో – పీసీ సి. వెంకట్ రాములు (PRO) ప్రథమ స్థానం సాధించారు.
    వీడియోగ్రఫీ విభాగంలో – పీసీ బి. నరేష్ ప్రథమ స్థానం సాధించారు.
    ట్రాకింగ్ విభాగంలో – పోలీస్ జాగిలం "రుద్ర", హ్యాండ్లర్లు రవి, నరేందర్ ద్వితీయ స్థానం సాధించారు.
    బాంబు డిస్పోజల్ టీమ్ – రూమ్ సెర్చ్ విభాగంలో డి . లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు ప్రథమ స్థానంలో రావడం జరిగింది. మరియు యాక్సిస్ కంట్రోల్ విభాగంలో – డి. లక్ష్మీకాంత్ రెడ్డి, ఆంజనేయులు ద్వితీయ స్థానం సాధించారు.
    ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో కూడా ఇదే ఉత్సాహం, నైపుణ్యంతో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
    నారాయణపేట జిల్లా పోలీసు సిబ్బంది సాధించిన ఈ విజయాలు జిల్లా పోలీసు శాఖకు గర్వకారణమని, పోలీసు శాఖలో ఉన్న వృత్తి నైపుణ్యం, నిరంతర శిక్షణ, సేవా తత్పరతకు ఈ ఫలితాలు నిదర్శనమని డ్యూటీ మీట్ ఇంచార్జ్ మరికల్ సీఐ భగవంత్ రెడ్డి పేర్కొన్నారు.
    జిల్లా పోలీసు అధికారులు, సహచర సిబ్బంది విజేతలను అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా, జోన్‌కు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు