Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘క్వీన్ 2’కు భారీ షాక్..

    Author VENKATESH | 07 Jul 2026, 03:33 PM | Array
    ‘క్వీన్ 2’కు భారీ షాక్..

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘క్వీన్ 2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని లీగల్ సమస్య ఎదురైంది. క్వీన్ 2పై రూ.250 కోట్ల న్యాయపరమైన వివాదం నెలకొనడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం, ఫాంటమ్ స్టూడియోస్ ముంబై హైకోర్టులో జియోస్టార్‌పై రూ.250 కోట్ల దావా వేసింది. తమ అనుమతి లేకుండానే క్వీన్ 2 ను రూపొందించారని, ఇది అసలు సినిమా మేధో సంపత్తి (Intellectual Property) హక్కులను ఉల్లంఘించడమేనని సంస్థ ఆరోపిస్తోంది.
    ఫాంటమ్ స్టూడియోస్ వాదన ప్రకారం, ‘క్వీన్’ చిత్రానికి సంబంధించిన మేధో సంపత్తి హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉందని, సీక్వెల్‌లు లేదా అనుబంధ చిత్రాలు నిర్మించాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ‘క్వీన్ 2’ నిర్మాణానికి సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని, సీక్వెల్ నిర్మాణానికి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఫాంటమ్ స్టూడియోస్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. ఈ కారణంగానే ఈ సినిమా తమ హక్కులను ఉల్లంఘిస్తోందని సంస్థ ఆరోపిస్తోంది.