‘క్వీన్ 2’కు భారీ షాక్..

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ విజయాన్ని కూడా అందుకుంది. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘క్వీన్ 2’ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని లీగల్ సమస్య ఎదురైంది. క్వీన్ 2పై రూ.250 కోట్ల న్యాయపరమైన వివాదం నెలకొనడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా నివేదికల ప్రకారం, ఫాంటమ్ స్టూడియోస్ ముంబై హైకోర్టులో జియోస్టార్‌పై రూ.250 కోట్ల...