Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు.

    Author VENKATESH | 29 Jun 2026, 12:20 PM | ANDHRA PRADESH
    జగన్ హయాంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు.

    విజయనగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భూవివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి సంబంధించిన భూమి రికార్డులను తారుమారు చేసి, ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించే ప్రయత్నించారని అన్నారు. ఈ అంశంపై తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

    ‘మా స్థలానికి సంబంధించిన రికార్డులను మార్చేశారు. అసలు ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా ఎలా మార్చగలిగారు?’ అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ఈ వివాదంలో అసలు సమస్యను పక్కదారి పట్టించే విధంగా కొన్నివర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని, సంబంధిత అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశామని తెలిపారు. అయితే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరగాలని, భూ రికార్డులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.