Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షరీఫా మసీద్ వద్ద సరికొత్త వెలుగులతో స్ట్రీట్ లైట్ ప్రారంభం..

    Author VENKATESH | 28 Jun 2026, 07:27 PM | నారాయణపేట
    షరీఫా మసీద్ వద్ద సరికొత్త వెలుగులతో స్ట్రీట్ లైట్ ప్రారంభం..

    - ట్రీట్ లైట్ ను ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ అలుకూరి పావని
    నారాయణపేట, జూన్ 28 (బీవీకే న్యూస్)
    మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని షరీఫా మసీదు వద్ద నూతనంగా స్ట్రీట్ లైట్ ను ఆదివారం స్థానిక వార్డు కౌన్సిలర్ అలుకూరి పావని ప్రారంభించారు.
    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
    షరీఫా మసీదు వద్ద ప్రార్థన సమయంలో సరైన వెలుతురు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, స్ట్రీట్ లైట్ వేయించాలని మైనార్టీ సోదరులు కోరిన వెంటనే... స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసి ప్రారంభించుకున్నామని అన్నారు. మక్తల్ ప్రాంతం కులమతాలకతీతంగా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారని, ఈ ప్రాంతంలో అందరి పండుగలు ఒకరినొకరు జరుపుకుంటూ సంతోషంగా జీవిస్తారని, మక్తల్ ప్రాంతం ఇతర ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
    కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవికుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాం, కోఆప్షన్ సభ్యులు ఉసాముద్దీన్, మైనార్టీ మత పెద్దలు నజీర్ హమ్మద్, జాహిద్ , బాబా, యూసుఫ్, అన్వర్ , అయూబ్ , కల్వాల్ ఫజల్ తదితరులు పాల్గొన్నారు.