Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

    Author VENKATESH | 28 Jun 2026, 03:45 PM | Crime
    షాకింగ్.. ప్రియురాలిని బెదిరించాలనుకున్నాడు.. తానే ప్రాణాలు కోల్పోయాడు..

    కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జాతీయ రహదారి-48పై శనివారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు తన ప్రియురాలితో కలిసి కారులో వెళుతూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. బాంబుతో ఆమెను బెదిరించాలనుకున్నాడు. అయితే క్షణాల వ్యవధిలో ఆమె దిగిపోవడంతో తాను ఒక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కూడా ప్రాణాలతో బయటపడ్డాడు (Karnataka car blast).
    బెంగళూరలో నివాసం ఉంటున్న రమ్యా ఉల్లాస్ అనే యువతి స్థానిక సంజయ్ గాంధీ హాస్పిటల్‌లో ఓటీ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. ఆమె ఆరేళ్లుగా నాగేంద్ర అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో నాగేంద్ర నంబర్‌ను ఆమె బ్లాక్‌లో పెట్టి దూరంగా ఉంటోంది. శనివారం ఉదయం నాగేంద్ర నేరుగా ఆ యువతి గదికి వచ్చాడు. ఆమెతో గొడవకు దిగాడు. అనంతరం ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసి అంకోలా వైపు తీసుకెళ్లాడు
    కారులో ఉన్న సమయంలో కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నాగేంద్ర తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసి రమ్యపై దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే కలిసి చనిపోదామని ఓ బాంబు తీశాడు. దీంతో రమ్య వెంటనే అప్రమత్తమైంది. డ్రైవర్‌కు విషయం చెప్పి, తను కూడా చాకచక్యంగా బయటకు దూకేసింది. డ్రైవర్ వెంటనే కారును రోడ్డు పక్కన ఆపి బయటకు దిగాడు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా పేలిపోయింది.