Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం..

    Author VENKATESH | 26 Jun 2026, 09:50 PM | ANDHRA PRADESH
     సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం..

    సీఎం చంద్రబాబు నాయకత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు ఏపీ హూం మంత్రి వెలగపూడి అనిత అన్నారు. అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొని, డ్రగ్స్ నిర్మూలనలో విశేష ప్రతిభ కనబరిచిన 'ఈగల్ టాస్క్ ఫోర్స్' అధికారులకు ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టగలిగామని స్పష్టం చేశారు. గతంలో దాదాపు 17 వేల నుంచి 20 వేల ఎకరాల్లో సాగైన గంజాయి తోటలను ఇప్పుడు పూర్తిగా నిర్మూలించి, సాగును జీరో స్థాయికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గంజాయి సాగుకు అలవాటు పడిన రైతులకు నష్టం జరగకుండా, వారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రభుత్వం తరఫున అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు.