Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు

    Author VENKATESH | 24 Jun 2026, 05:01 PM | ఆంధ్రప్రదేశ్
    'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' అమలుకు పటిష్ఠ చర్యలు

    ఏపీలో 'నేషనల్ రేర్ డిసీజెస్ పాలసీ' సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ​ఆర్థిక స్థోమత లేకపోయినా, వ్యాధి అరుదైనదైనా ప్రతి రోగికీ వైద్యం అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ​అరుదైన వ్యాధులను ముందే గుర్తించేందుకు రాష్ట్రంలో 'యూనివర్సల్ నియోనాటల్ స్క్రీనింగ్' ప్రారంభించినట్లు తెలిపారు. ​ప్రత్యేక వైద్యం, పరిశోధనల కోసం ఏపీలో మూడు 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కేంద్రాలను గుర్తించామని.. ​విశాఖ (AMC), విజయవాడ (SMC), తిరుపతిలో 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ​​
    పరిశోధనల కోసం PSU, CSR నిధుల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎమ్‌ఈ(DME) అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ​కేంద్ర జాబితాలో లేని 'హంటింగ్‌టన్స్ వ్యాధి'పై కూడా ప్రభుత్వం ముందస్తు (Proactive) చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ​పాలసీ అమలులో కేరళ వంటి రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.​ బాధితుల ఆర్థిక భరోసా కోసం ప్రత్యేక నిధుల ఏర్పాటు అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.