Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని వామపక్షాల డిమాండ్

    Author VENKATESH | 24 Jun 2026, 04:35 PM | వరంగల్
    పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని వామపక్షాల డిమాండ్

    వరంగల్,జూన్ 24 సుదీక్ష న్యూస్ :
    వరంగల్ నగరంలో పేదల గుడిసెల కూల్చివేతలను వెంటనే నిలిపివేసి, నివాసం లేని పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శివనగర్‌లోని తమ్మేర భవన్‌లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మేకల రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్ మాట్లాడారు.
    గోపాలపురం చెరువు, గుండ్ల సింగారం ప్రాంతాల్లో పేదల గుడిసెలను కూల్చివేయడం అన్యాయమని, భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకుండా నిరుపేదల ఇళ్లను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కూల్చివేతలు ఆపి, పేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు.
    డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించిన నాయకులు, ఈ నెల 27న ఏకశిలా పార్కు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.