Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఐ నాగరాజు అరెస్ట్.. సాయికృష్ణ కుటుంబం రియాక్షన్ ఇదే..

    Author VENKATESH | 23 Jun 2026, 05:20 PM | ANDHRA PRADESH
    సీఐ నాగరాజు అరెస్ట్.. సాయికృష్ణ కుటుంబం రియాక్షన్ ఇదే..

    కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు అరెస్టుపై సాయికృష్ణ కుటుంబం స్పందించింది. నాగరాజు అరెస్టుపై సాయికృష్ణ మేనమామ నవరంగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో కిందిస్థాయిలోని వారికి కూడా న్యాయం జరుగుతుందనే దానికి నాగరాజు అరెస్టే నిదర్శనమన్నారు నవరంగ్. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. మరోవైపు గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్.. ఈ కేసును విచారిస్తోంది.

    ఈ క్రమంలోనే మంగళవారం రోజున సింగ్ నగర్‌లోని నాగరాజు ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి.. నాగరాజుకు సంఘీభావంగా అతని మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. సీఐ నాగరాజును అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఉద్రిక్తత తలెత్తింది. అయితే పోలీసులు భారీగా మోహరించి.. పరిస్థితిని చక్కదిద్దారు. నాగరాజును అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ గెస్ట్ హౌస్‌కు తరలించారు. సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్.. నాగరాజును విచారించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో అతని స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు.


    సిట్ దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయం..
    మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు ఓ కీలక విషయాన్ని గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు తెలిసింది. మే ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఉన్న సీసీటీవీ ఫుటేజీ.. సిస్టమ్ నుంచి మాయమైనట్లు సమాచారం. నెల రోజుల రికార్డింగ్స్ బదులుగా.. రెండు రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. మిగతా సీసీ ఫుటేజీని డిలీట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డేటా రికవరీ నిపుణుల సహాయంతో తొలగించిన సీసీ ఫుటేజీని రికవరీ చేసే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నట్లు తెలిసింది.

    ఇవి కూడా చదవండి

    మరోవైపు మే నెలలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయారంటూ అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక సీఐ నాగరాజు పాత్ర ఉందని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఇటీవల కలిశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసింది.