Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు పెంపు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

    Author VENKATESH | 23 Jun 2026, 05:19 PM | ANDHRA PRADESH
    ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు పెంపు.. కేబినెట్ కీలక నిర్ణయాలు

    ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంగళవారం రోజున సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.34 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఉండవల్లిలో మౌలిక వసతులకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీకి రూ.130 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దాదాపు 80కి పైగా అజెండా అంశాలను ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించినట్లు అనిత ట్వీట్ చేశారు.