Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మనసు మరణిస్తె?

    Author VENKATESH | 22 Jun 2026, 05:55 PM | EDITORIAL
    మనసు మరణిస్తె?

    మనిషి చచ్చి పోతే
    అందరికీ తెలుస్తుంది
    మనసు మరణిస్తె
    ఆది మోసే వారికే
    తెలుస్తుంది

    మనసు గతి ఇంతే
    మనిషి బతుకింతే
    మనసున్న మనిషికి
    సుఖంలేదంతే‌ అన్న
    ఓసినీ కవి సందేశం
    సమాజానికి కనువిప్పు
    కావాలి

    మాటలతో
    మనసు
    విరుగుతుంది
    విరిగితే అతుకదు
    గాయమైతే

    మాసిపోదు
    మనసు ఎలావుంటే
    మనం అలా వుంటాం

    మాటతో మనుసులు
    కుటుంబాలు సంస్థలు
    దేశాలు కలుస్తాయి
    విడిపోతాయి
    మాటప్రాణం పోస్తుంది
    మాట ప్రాణం తీస్తుంది
    స్వతంత్ర భారత్
    ముక్కలు కావటానికి
    మాటేకారణం

    ఇవి కూడా చదవండి

    మూర్ఖత్వం మూఢత్వం
    మనసును చంపేస్తుంది
    ఆత్మీయత అభిమానం
    ఆప్యాయత ఆర్ద్రత
    ప్రేమ మమతను
    పండిస్తే
    మనసు పులకరిస్తుంది
    మంచి మాటల
    మాధుర్య తోటలో
    మనసు పునర్జీవిస్తుంది

    మనుషిలో ప్రేమ
    అర్థం చేసుకునే
    మనసు ఉండాలి
    సముద్రం అంత
    సంపద
    ఉంటే సరిపోదు
    సమయానికి సాయం
    చేసే గుణం ఉండాలి

    మమత మానవీయత
    ఓదార్పు సంఘీభావం
    సత్యం హితం
    మితం స్మితం
    మధురం ప్రథమం
    లక్షణాలతో
    మనిషి ఎదుగాలి
    మంచితనంతో
    ఒధుగాలి
    ఓర్పు మార్పుతో
    మనసును
    పరిపుష్టం
    చేద్దాం
    మానవాభివృద్ధికి
    పాటు పడుదాం

    నేదునూరి కనకయ్య'
    రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్స్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    మాజీ కరెస్పాండెంట్
    జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
    కరీంనగర్
    సామాజిక ఆర్థిక అధ్యయన
    వేదిక కరీంనగర్
    9440245771