Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫిలిప్పీన్స్‌లో దారుణం..

    Author VENKATESH | 22 Jun 2026, 12:24 PM | INTERNATIONAL
    ఫిలిప్పీన్స్‌లో దారుణం..

    టాక్లోబన్‌లోని శాన్ హోసే నేషనల్ హైస్కూల్‌లో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు సాయుధులు అక్రమంగా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి విద్యార్థులపై విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్రమైన బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ పాఠశాలలో మెుత్తం 1,500మంది విద్యార్థులు ఉండగా.. కాల్పుల ఘటనతో పాఠశాల సిబ్బంది సహా వారంతా బయటకు పరుగులు తీశారు.
    పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాడికి ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుల్లో ఒకరిని అదే పాఠశాలకు చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు దాడిలో గాయపడిన ఐదుగురిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ మేరకు పాఠశాల చుట్టుపక్కల ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.