Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా 16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని జన్మదిన వేడుకలు..

    Author VENKATESH | 16 Jun 2026, 07:57 PM | TELANGANA
    ఘనంగా 16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని జన్మదిన వేడుకలు..

    150 పడకల ఆసుపత్రి వద్ద కార్మికుల సమక్షంలో సంబురాలు..

    మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని జన్మదిన వేడుకలు నూతనంగా నిర్మిస్తున్న 150 పడకల ఆసుపత్రి వద్ద కార్మికుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులు, స్థానిక నేతల మధ్యన కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మక్తల్ సివిల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది

    ఈ సందర్భంగా కౌన్సిలర్ అల్కూరి పావని మాట్లాడుతూ..

    ఇవి కూడా చదవండి

    మంత్రి వాకిటి శ్రీహరి గారు, ఆయన సతీమణి వాకిటి లలిత గారి ఆశీస్సులతో...చిన్న వయసులోనే కౌన్సిలర్ గా తనకు అవకాశం ఇచ్చారని, ఈ సందర్భంగా వారికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కేవలం వంద రోజుల్లోనే లక్షల రూపాయల నిధులు కేటాయించి, వార్డు అభివృద్ధి కి మంత్రి వాకిటి శ్రీహరి గారు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో సైతం మంత్రి వాకిటి శ్రీహరి గారి సహకారంతో వార్డు అభివృద్ధి కి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.

    కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శాలం, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్,
    నాయకులు కలాల్ నీల గౌడ్, వల్లంపల్లి గురు రాజ్, ప్రవీణ్ కుమార్, ఆనంపల్లి రమేష్ దామరగిద్ద రాము , కడే చూర్ రాజేష్ , అంబాదాస్ రావు, అమ్రేష్ ,మహమ్మద్, అఫ్రోజ్ , మందిపాల్ సతీష్ , నీలి సంతోష్ , రఫ్ ,ప్రవీణ్ కుమార్, నాదర్ , తదితరులు పాల్గొన్నారు.