Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!

    Author VENKATESH | 16 Jun 2026, 12:17 PM | Bhakti
    నిజ జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం- ఈ నెలలో వచ్చే పర్వదినాలు, పుణ్య తిథులు ఇవే!

    : తెలుగు మాసాల్లో మూడవ మాసమైన జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం ఏర్పడినందున నిజ జ్యేష్ఠ మాసంలోనే అన్ని పర్వదినాలు, పుణ్య తిధులు జరుపుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా నిజ జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? ఈ మాసంలో రానున్న పుణ్య తిధులు, పండుగల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

    జ్యేష్ఠ మాసం విశిష్టత
    తెలుగు పంచాంగం ప్రకారం పౌర్ణమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించే మాసం కాబట్టి ఈ మాసానికి జ్యేష్ఠ మాసం అని పేరు వచ్చింది. బ్రహ్మ దేవునికి ప్రీతికరమైన జ్యేష్ఠ మాసంలో నెల రోజుల పాటు గోధుమ పిండితో బ్రహ్మదేవుని ప్రతిమను తయారు చేసి పూజించడం వల్ల విశేష ఫలితాలు, సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక ఈ మాసంలో రానున్న పర్వదినాలు, పుణ్య తిధులు గురించి తెలుసుకుందాం.

    జూన్ 16, మంగళవారం జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి/ విదియ: ఈ రోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. చంద్రోదయం, తిరుమలలో పెరియాళ్వార్ ఉత్సవం ప్రారంభం

    జూన్ 17, బుధవారం జ్యేష్ఠ శుద్ధ తదియ: రంభ తృతీయ వ్రతం

    జూన్ 21, ఆదివారం జ్యేష్ఠ శుద్ధ సప్తమి: భాను సప్తమి, ప్రపంచ యోగా దినోత్సవం

    జూన్ 22, సోమవారం జ్యేష్ఠ శుద్ధ అష్టమి: ఆరుద్ర కార్తె, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్పయాగం

    జూన్ 24, బుధవారం జ్యేష్ఠ శుద్ధ దశమి: దశపాపహర దశమి, నారాయణ వనం శ్రీ చంపకవల్లి సమేత పరాశరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సమాప్తం

    జూన్ 25, గురువారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి: నిర్జల ఏకాదశి, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల తెప్పోత్సవాలు ప్రారంభం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, ధ్వజారోహణం

    జూన్ 26, శుక్రవారం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి: రామలక్ష్మణ ద్వాదశి, తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం మహోత్సవం ప్రారంభం

    ఇవి కూడా చదవండి

    జూన్ 27, శనివారం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి: శని త్రయోదశి, శని ప్రదోషం

    జూన్ 28, ఆదివారం జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి: తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం మహోత్సవం సమాప్తం

    జూన్ 29, సోమవారం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి: ఏరువాక పున్నమి, వృషభ పూజనం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ, కబీర్ దాస్ జయంతి, వటసావిత్రి వ్రతం, తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల తెప్పోత్సవాలు సమాప్తం.

    జూలై 2, గురువారం జ్యేష్ఠ బహుళ తదియ: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవం

    జూలై 3, శుక్రవారం జ్యేష్ఠ బహుళ చవితి: సంకష్టహర చవితి, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజావరోహణం, బ్రహ్మోత్సవాలు సమాప్తం

    జూలై 6, మంగళవారం జ్యేష్ఠ బహుళ షష్టి: పునర్వసు కార్తె

    జూలై 10, శుక్రవారం జ్యేష్ఠ బహుళ ఏకాదశి: యోగిని ఏకాదశి

    జూలై 12, ఆదివారం జ్యేష్ఠ బహుళ త్రయోదశి/ చతుర్దశి: పక్ష ప్రదోషం, మాసశివరాత్రి

    జూలై 14, మంగళవారం జ్యేష్ఠ బహుళ అమావాస్య: దర్శ అమావాస్య ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం ముగిసి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో శాస్త్రంలో సూచించిన విధంగా పండుగలు, పుణ్య తిధులు ఆచరిద్దాం. బ్రహ్మదేవుని పూజిద్దాం. సకల సౌభాగ్యాలు పొందుదాం. శుభం భూయాత్!

    ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.