Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సోమవతి అమావాస్య రోజు శివారాధన చేస్తే చాలు- ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం!

    Author VENKATESH | 15 Jun 2026, 11:57 AM | Bhakti
    సోమవతి అమావాస్య రోజు శివారాధన చేస్తే చాలు- ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ సొంతం!

    పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు సోమవారమని తెలిసిందే! అలాగే శనివారం, అమావాస్య రోజులు కూడా శివుని ఆరాధనకు శ్రేష్ఠమైనవని శివ పురాణం చెబుతోంది. ముఖ్యంగా అమావాస్య రోజు శివయ్యను పూజిస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని అంటారు. ఇక సోమవారం, అమావాస్య కలిసి వచ్చిన రోజు చేసే శివారాధన మామూలు రోజుల్లో చేసే పూజల కన్నా కోటిరెట్ల అధిక ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. సూర్య గ్రహణంతో సమానమైన సోమవతి అమావాస్య అంటే ఏమిటి? ఆ రోజు మహాదేవుని ఎలా పూజించాలి? పూజ ఫలం ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    సోమవతి అమావాస్య అంటే?
    సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సనాతన సంప్రదాయంలో ఈ రోజును అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన తిథిగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు మరియు దానధర్మాలు అపారమైన ఫలితాలను ఇస్తాయని పురాణ వచనం.

    సోమవతి అమావాస్య ఎప్పుడు?
    తెలుగు పంచాంగం ప్రకారం జూన్ 15, సోమవారం, అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి, ఈ రోజును సోమవతి అమావాస్యగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవతి అమావాస్య విశిష్టత తెలుసుకుందాం.

    ఇవి కూడా చదవండి

    సోమవతి అమావాస్య విశిష్టత
    సోమవతి అమావాస్య కోట్ల గ్రహణాలతో సమానమని శాస్త్రం చెబుతోంది. వ్యాస మహర్షి వివరించిన ప్రకారం అరుదుగా వచ్చే ఈ సోమవతి అమావాస్య రోజు పుణ్య నదుల్లో స్నానం ఆచరించి, పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు నిర్వహించి, పేదలకు దానధర్మాలు చేయడం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుందని, శివ కైవల్యం ప్రాప్తిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు సోమవతి అమావాస్య వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం.