Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే 'జ్వరహరేశ్వరుడు'- విచిత్ర శివ స్వరూపం గురించి తెలుసా?

    Author VENKATESH | 15 Jun 2026, 11:55 AM | Bhakti
    జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే 'జ్వరహరేశ్వరుడు'- విచిత్ర శివ స్వరూపం గురించి తెలుసా?

    హిందూ మత విశ్వాసాల ప్రకారం భరించలేని రోగాలు, చికిత్సకు లొంగని మొండి రోగాలు శివుణ్ణి ఆశ్రయిస్తే తొలగుతాయని విశ్వాసం. పరమేశ్వరుడు లయకారుడు మాత్రమే కాదు రోగహారకుడుగా కూడా పలుచోట్ల పూజలందుకుంటున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ప్రాణాంతక వ్యాధులు కూడా పరమేశ్వరుని అనుగ్రహం తో నయమైన ఘటనలు ఆధ్యాత్మిక చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటిదే ఓ శివ స్వరూపం విష జ్వరాలను సైతం నయం చేస్తుందని విశ్వాసం. జ్వర హరేశ్వరునిగా శివుడు పూజలందుకుంటున్న ఈ క్షేత్రం ఎక్కడుంది? ఆ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    జ్వరహరేశ్వరుని స్వరూపం!
    మూడు ముఖాలు, మూడు కాళ్లు! మూడు చేతులు, అగ్నిజ్వాలలు వంటి నేత్రాలు వ్యాధులను నయం చేసే ఈశ్వరుని విచిత్ర రూపమే జ్వర హరేశ్వరుని స్వరూపం. మన దేవాలయాలలోని దైవ స్వరూపాలు కేవలం పూజల కోసమే కాదు, వాటిలో ప్రతి ఒక్కదాని వెనుక అద్భుతమైన వైద్య విజ్ఞానం, లోతైన పురాణ కథలు దాగి ఉన్నాయి. ఆ కోవలోనే, మనలో చాలా మందికి తెలిసే అవకాశం లేని, పరమశివుని అత్యంత విచిత్రమైన ఒక రూపం గురించి తెలుసుకుందాం. ఆ స్వరూపమే "జ్వర హరేశ్వరుడు".

    జ్వరహరేశ్వరుని స్వరూపం ఎక్కడ దర్శనమిస్తుంది?
    కాంచీపురం లోని పురాతన జ్వర హరేశ్వరాలయంలో మనం ఈ విచిత్ర రూపాన్ని దర్శించుకోవచ్చు. అంతుచిక్కని జ్వరాలను హరించే వాడు కాబట్టి ఇక్కడ శివుని జ్వర హరేశ్వరుడని అంటారు.

    ఇవి కూడా చదవండి

    త్రిమూర్తులకు సంకేతంగా మూడు ముఖాలు
    జ్వర హరేశ్వరుని స్వరూపం సాధారణ శివ రూపాలకు భిన్నంగా, చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జ్వరహరేశ్వరుని రూపం సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులకు ప్రతీకగా ఈ స్వరూపం మూడు ముఖాలు కలిగి ఉంటుంది.