Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణలో మోగిన బడి గంట - బ్రేక్ ఫాస్ట్తో తెరుచుకున్న పాఠశాలలు

    Author VENKATESH | 15 Jun 2026, 11:27 AM | TELANGANA, హైదరాబాద్
    తెలంగాణలో మోగిన బడి గంట - బ్రేక్ ఫాస్ట్తో తెరుచుకున్న పాఠశాలలు

    నేడు తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్​లోని రాజ్​భవన్ పాఠశాలలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థులకు టీచర్లు, సిబ్బంది బ్రేక్‌ఫాస్ట్​ను అందించారు. ఇంటర్, పాఠశాల విద్యార్థులు కలిపి 1.44 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజే పుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.

    రాజ్‌భవన్ బడిలో బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి పొన్నం నేలపై కూర్చుని విద్యార్థులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆల, మాజీ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    అందరం కలిసి ప్రయత్నించాలి : ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని, త్వరలోనే అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన, సబ్జెక్ట్ నిపుణులు ఉన్నారన్న ఆయన విద్యార్థుల సంఖ్య పెరిగేలా టీచర్లు, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    "ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరం ప్రయత్నించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంచుతున్నాం. త్వరలోనే అన్ని పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు చేస్తాం" - పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి

    ప్రొటోకాల్ వివాదం : రాజ్‌భవన్‌ బడిలో బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న కొంతమంది అధికారులపై మండిపడ్డారు. కార్యక్రమంలో ప్రసంగించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కోరినా ఆయన సున్నితంగా నిరాకరించారు.

    బడిబాట పట్టిన విద్యార్థులు : సికింద్రాబాద్ కంటోన్మెంట్, అల్వాల్ ప్రాంతాల్లో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచి పాఠశాలలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు ముగియడంతో బడిబాట పట్టిన విద్యార్థులకు నేటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మారేడుపల్లి, తిరుమలగిరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పెట్టారు.

    కేసులు నమోదు చేస్తున్న రవాణాశాఖ : మరోవైపు స్కూళ్లు పునః ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యా సంస్థల వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ కేసులు నమోదు చేస్తుంది. ఇవాళ వెయ్యికి పైగా స్కూల్‌ బస్సులను తనిఖీలు చేసిన ఆర్టీఏ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన 150కి పైగా బస్సులపై కేసు నమోదు చేశారు. ఫిట్‌నెస్ లేని 35 విద్యాసంస్థల వాహనాలను సీజ్ చేశారు.