Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్

    Author VENKATESH | 13 Jun 2026, 04:12 PM | TELANGANA, హైదరాబాద్
    ‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్

    రాజన్న సిరిసిల్ల, జూన్ 13 : తెలంగాణలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఆరోపించారు. ‘సర్’ ప్రక్రియను బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కేటీఆర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
    బీజేపీ, కాంగ్రెస్‌లాగా దొంగ ఓట్లతో గెలవాలని తాము అనుకోమని కేటీఆర్ తేల్చిచెప్పారు. రైతుభరోసా వేయకుండా రేవంత్‌రెడ్డి సర్కార్ రైతన్నలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. 420 హామీలు ఇచ్చి ప్రజలను బురిడీ కొట్టించారని ఎద్దేవా చేశారు. ‘సర్’ పేరుతో దొంగ ఓట్లతో అసలైన ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.