Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యోగ తో ఆరోగ్యం ఆనందం (జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా)

    Author VENKATESH | 13 Jun 2026, 10:32 AM | Array
    యోగ తో ఆరోగ్యం ఆనందం (జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా)

    నిత్య యోగ నవయవ్వన ప్రదాత
    యోగ తో బలం శారీరక మానసిక
    సంతులనం సంతోషం
    యోగ నిరాశ నిస్స్ప్రహలు తుంచి
    ఆందోళన ఒత్తిడి తగ్గించి
    ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచి
    నైపుణ్యాభివృద్ధితో
    ఉత్పాదక శక్తి సామర్ధ్యాలు
    ఇనుమడిస్థాయి
    జీవనప్రమాణాలు పెరుగుతాయి
    యోగతో జీవితంలో ఆనందం అంతర్గ
    శాంతి ప్రశాంతత ప్రగతి పురోగతి సిద్ధిస్తుంది
    నిత్య యోగ శ్వాస ధ్యానం
    ఆరోగ్య సంపదకు నిలయం
    శ్వాస మీద ధ్యాస
    ఆత్మనిర్బరతకు బాట
    శ్వాస మనసు ఆత్మ
    సమన్వయ వారథి యోగ
    యోగతో ఉల్లాసం
    ఉత్సాహం మనోల్లాసం
    అత్మశ్వాసం దైర్యం
    సాహాసం ‌సహనం
    యోగతో రోగాలు దూరం
    రక్తపోటు వెన్నునొప్పి
    ఆర్థరైటిస్ అధిక బరువు తగ్గేను
    సామూహిక యోగ తో ఒంటరి తనం
    మాయమై‌ సమిష్టి జీవన విధానం
    పరిమళిస్తుంది
    యోగాతో మానవత్వాన్ని జోడించి
    యోగ పరివ్యాప్తి ప్రక్రియలో
    ప్రజా భాగమ్యాన్ని పెంచాలన్న
    ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులు
    "వసుదైక కుటుంబం" అనే
    ఇతివృత్తంతో ఈ ఏడు
    జరిగే అంతర్జాతీయ యోగ
    దినోత్సవం ఆరోగ్య భారత్
    అవతరణకు ఆలంభణ కావాలి
    రండి లేవండి మేల్కొండి
    గమ్యం చేరే వరకు విశ్రమించకండి
    అన్న వివేకానందుని పిలుపు
    స్ఫూర్తిగా తీసుకుని
    భారతీయ ఆరోగ్య ఆనంద జీవ కళ
    యోగాను విశ్వ వ్యాప్తం చేసేందుకు
    ఉద్యమిద్దాం


    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక కరీంనగర్ 9440245771