Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ నిర్మూలన గురించి విస్తృత తనిఖీలు

    Author VENKATESH | 12 Jun 2026, 06:33 PM | TELANGANA, నారాయణపేట
    డ్రగ్స్ నిర్మూలన గురించి విస్తృత తనిఖీలు

    : మాగనూరు ఎస్సై అశోక్ బాబు

    నారాయణపేట జిల్లా,జూన్ 12( బి వి కే న్యూస్ )

    జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఆదేశాల మేరకు
    మాగనూరు నారాయణపేట జిల్లా, మాగనూరు మండల కేంద్రంలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం ఈగల్ ఫోర్స్ టీంతో కలిసి, నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలం విక్కి తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు మాగనూర్ ఎస్ఐ అశోక్ బాబు తెలిపారు. బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు, పాన్ షాపులు, కిరణ దుకాణాలు అనుమానాస్పద ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు.
    మత్తు పదార్థాల రవాణా, నిల్వ, విక్రయాలు మరియు వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
    ప్రజలు ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా, రవాణా చేస్తున్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1908 లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
    ఈ తనిఖీల్లో నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పీసీ రవి,మాగనూర్ పోలీసులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి