Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సంగారెడ్డి మైత్రి డ్రగ్స్ ల్యాబ్‌లో ప్రమాదం..

    Author VENKATESH | 12 Jun 2026, 12:27 PM | TELANGANA, సంగారెడ్డి
    సంగారెడ్డి మైత్రి డ్రగ్స్ ల్యాబ్‌లో ప్రమాదం..

    సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురైన ఓ కార్మికుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.

    మతుడిని మెదక్ జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ (25)గా గుర్తించారు. మూడు రోజుల క్రితం మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ల్యాబ్‌లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినల్లు సమాచారం. ప్రమాదం అనంతరం విషయం బటకు రాకుండా ఉండేందుకు బాధితుడిని సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రవీన్ మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.