Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కౌమార యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలి - లయన్‌ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

    Author VENKATESH | 12 Jun 2026, 12:21 PM | TELANGANA
    కౌమార యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలి - లయన్‌ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు

    యువభారతంలోని అతి ముఖ్యమైన విభాగం అయిన కౌమార యువతలో సరైన ఆధునిక జీవన నైపుణ్యాలు పెంపొందిస్తేనే రేపటి భారతదేశానికి సమర్థవంతమైన నాయకత్వం లభిస్తుందని లయన్‌ జిల్లా గవర్నర్‌ లయన్‌ సింహరాజు కోదండరామ్ అన్నారు. ఈ రోజు స్థానిక సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో శాతవాహన లయన్స్ క్లబ్‌ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక రెండు రోజుల లయన్స్‌ క్వెస్ట్‌ టీచర్‌ ట్రైనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీన్‌ ఏజ్ యువత శరీరంలో వచ్చే హార్మోనల్‌ మార్పులకు అనుగుణంగా వారి మానసిక స్థాయిని సరైన పద్ధతిలో మార్గదర్శనం చేయడానికి లయన్స్‌ క్వెస్ట్‌ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కౌమార యువత వ్యక్తిగత శారీరక, మానసిక, భావోద్వేగ సమతుల్యత సాధించేందుకు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాస శిక్షణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని లయన్స్‌ క్వెస్ట్‌ శిక్షణను ఏర్పాటు చేసేతున్నామని తెలిపుతూ ఈ టీచర్ల శిక్షణ తరగతులను ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన లయన్‌ ఎం భద్రేశం మాట్లాడుతూ మార్కులు, ర్యాంకుల చుట్టు తిరుగుతున్న నేటి విద్యావిధానంలో పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణానికి కృషి జరగడం లేదని తెలిపారు. మన పునాదులను నేటి టీన్స్‌కు పరిచయం చేయాల్సిన అవసరముందన్నారు. సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్‌ లయన్‌ పి ఫాతిమా రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు తయారు చేసిన అంశాలతో కూడిన శిక్షణ అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. చైర్మన్‌ లయన్‌ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థి చుట్టు సహచరులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌర సమాజం వలయం ఏర్పడిందని, దీని ప్రాముఖ్యతను పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. సభాధ్యక్షత వహించిన లయన్‌ పి ప్రవీణ్ మాట్లాడుతూ 5 లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్న లయన్స్‌ క్వెస్ట్‌ టీచర్ల శిక్షణకు ఈ పాఠశాల అర్హత సాధించడం హర్షణీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డితో పాటు శాతవాహన లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎం మహెందర్‌, జిఎల్‌టీ కోఆర్డినేటర్ ఈ రమేష్, రీజియన్‌ చైర్మన్ లయన్‌ వి జగదీశ్వర చారి, కార్యదర్శి లయన్‌ జి చంద్ర శేఖర్, కోశాధికారి లయన్‌ పి సురెందర్‌, లయన్‌ ఎన్‌ వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2-రోజుల శిక్షణ కార్యక్రమంలో మాస్టర్‌ ట్రేనర్‌ కె రేణుక, పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రియదర్శిని, విజన్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు ఐదుగురు, సెయింట్ జార్జ్ పాఠశాలకు చెందిన 24 టీచర్స్, 05 గురు ప్యారడైజ్ శిక్షణలో ఎంపికైన విలువైన సమయాన్ని వెచ్చించడం జరిగింది.

    కౌమార యువతలో జీవన నైపుణ్యాలను పెంపొందించాలి - లయన్‌ జిల్లా గవర్నర్ కోదండరామ్ సింహరాజు - Additional Image