Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వైభవ్ ఫ్రెండ్ విధ్వంసకర ఇన్నింగ్స్- 83బంతుల్లోనే డబుల్ సెంచరీ- తలకు తీవ్ర గాయమైనా తగ్గేదేలే!

    Author VENKATESH | 11 Jun 2026, 12:24 PM | Sports
    వైభవ్ ఫ్రెండ్ విధ్వంసకర ఇన్నింగ్స్- 83బంతుల్లోనే డబుల్ సెంచరీ- తలకు తీవ్ర గాయమైనా తగ్గేదేలే!

    మరో 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. బిహార్​లోని సమస్తీపుర్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తరహాలోనే ఇప్పుడు ముజఫర్‌పుర్‌కు చెందిన అయాన్ రాజ్ అనే ప్లేయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముజఫర్‌పుర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న అండర్ 16 క్రికెట్ లీగ్‌లో ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ రికార్డుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

    83 బంతుల్లోనే 210 రన్స్ డబుల్ సెంచరీ
    ఇటీవలే టీమ్​ఇండియా అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్న ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీకి అయాన్ రాజ్ చిన్ననాటి స్నేహితుడు. జిల్లా అండర్ 16 క్రికెట్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే సంస్కృతి క్లబ్ తరఫున బరిలోకి దిగిన అయాన్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 83 బంతులు మాత్రమే ఎదుర్కొని ఏకంగా 210 పరుగులు సాధించి ధమాకా డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌లో 35 ఫోర్లు 9 సిక్సర్లు ఉండటం హైలెట్. మైదానం చుట్టూ అతను కొట్టిన షాట్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.