Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూలు.. ట్రంప్ సర్కార్ కొత్త పాలసీ!

    Author VENKATESH | 09 Jun 2026, 12:53 PM | INTERNATIONAL
    750 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల్లోనే అమెరికా వీసా ఇంటర్వ్యూలు.. ట్రంప్ సర్కార్ కొత్త పాలసీ!

    అమెరికా వెళ్లాలనుకునే వ్యాపారులు, పర్యాటకుల కోసం ట్రంప్ సర్కా్ర్ కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. వీసా ఇంటర్యూల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా 10 రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూలను నిర్వహించేలా స్పెషల్ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రీమియం ఎక్స్‌పెడైటెడ్ సర్వీస్ పేరుతో ప్రత్యేక సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ తమ ఫెడరల్ రిజిస్టర్‌లో నోటీసులు ప్రచురించింది.

    ఈ నోటీసు ప్రకారం జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ పైలట్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే సాధారణ ఫీజు 185 డాలర్లకు అదనంగా 750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద 750 డాలర్లు అదనంగా చెల్లించిన దరఖాస్తుదారులకు 10 రోజుల్లోపే వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కల్పించనున్నారు. అయితే ఈ సదుపాయం ఎంపిక చేసిన కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. వాటి జాబితాను జూలై 1వ తేదీకి ముందు ప్రకటించనున్నారు.

    ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ప్రవేశ నిబంధనలనున మరింత కఠినతరం చేశారు. కొన్ని దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ కోసం భారీ బాండ్లు విధించడం, సోషల్‌మీడియా అకౌంట్లు సహా వ్యక్తిగత వివరాలపై విస్తృత పరిశీలన చేపట్టడం వల్ల వీసా ప్రక్రియలో ఆలస్యాలు పెరిగాయి. దీంతో అనేక దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే స్పెషల్ పైలట్ ప్రోగ్రామ్ కింద ప్రీమియం సర్వీస్‌ను అమెరికా ప్రవేశపెట్టడం గమనార్హం.

    ఇవి కూడా చదవండి