Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.

    Author VENKATESH | 08 Jun 2026, 12:21 PM | INTERNATIONAL
    ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం.

    ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూమి కంపించింది. మిండనావో ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయని తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, మలేసియా తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

    తీర ప్రాంత ప్రజలు వెంటనే ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోవాలని ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (ఫివోల్క్స్) హెచ్చరించింది. సాధారణ సముద్ర మట్టానికి మీటర్ కంటు ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది.