Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేడు ఢిల్లీలో మధ్యాహ్నం ఇండియా కూటమి కీలక సమావేశం..బహిష్కరించిన డీఎంకే

    Author VENKATESH | 08 Jun 2026, 12:17 PM | NATIONAL
    నేడు ఢిల్లీలో మధ్యాహ్నం ఇండియా కూటమి కీలక సమావేశం..బహిష్కరించిన డీఎంకే

    దేశ రాజధాని ఢిల్లీలో నేడు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇండియా జన్ బంధన్’(ఇండీ కూటమి) కీలక సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి 23 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఇండీ కూటమి నేతలు సమావేశం అవుతున్నారు. త్వరలో పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తృణమూల్‌ పార్టీ చీఫ్, మమతా బెనర్జీ హాజరై ఇటీవల పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించనున్నట్లు తెలిసింది.