Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

    Author VENKATESH | 19 Oct 2026, 09:37 PM | నల్గొండ
    దేవరకొండ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

    దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ధర్మ స్థాపనకు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ఆయన అన్నారు. దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించుకోవడం,పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేయడం మన సంప్రదాయాల్లో భాగమని పేర్కొన్నారు. జమ్మి ఆకులను బంగారంలా భావించి పరస్పరం పంచుకోవడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం, అలయ్‌-బలయ్‌ ద్వారా ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకతలని తెలిపారు.తెలంగాణ స్ఫూర్తితో దేశం మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. విజయదశమి స్ఫూర్తితో ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రగతిపథంలో నడిపించారని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.ఈ విజయదశమి పండుగ దేవరకొండ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు, సంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.