Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ నియోజకవర్గంలో జోరుగా కాంగ్రెస్ చేరికలు.. దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్

    Author VENKATESH | 19 Oct 2026, 08:22 PM | నల్గొండ
    దేవరకొండ నియోజకవర్గంలో జోరుగా కాంగ్రెస్ చేరికలు.. దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే బాలు నాయక్

    దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : గుడిపల్లి మండల కేంద్రంలోని ఆలయంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
    అనంతరం గుడిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన దాదాపు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే బాలు నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతున్నాయని, కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.అనంతరం పీఏ పల్లి మండలం అంగడిపేట గ్రామంలో నువ్వైనా దుర్గామాత అమ్మవారిని ఎమ్మెల్యే బాలు నాయక్ గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మావిల్ల లక్ష్మీనారాయణ యాదవ్, ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్, నెర్మటి సతీష్ రెడ్డి, వంగాల ప్రతాపరెడ్డి, కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుక్కల గోవర్ధన్ రెడ్డి, మద్దిమడుగు రామస్వామి, తేరా సత్యం రెడ్డి, శేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.