Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి: బీజేపీ మండల కో-కన్వీనర్ కడ్తాల బాలస్వామి

    Author VENKATESH | 16 Oct 2026, 07:59 PM | కరీంనగర్
    పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి: బీజేపీ మండల కో-కన్వీనర్ కడ్తాల బాలస్వామి

    దేవరకొండ,16అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    ​దేవరకొండ మండలంలోని తాటికోల్ గ్రామపంచాయతీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. బీజేపీ బూత్ అధ్యక్షులు గజ్జ ముత్యాలు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల కో-కన్వీనర్ కడ్తాల బాలస్వామి హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టభద్రులు తమ ప్రాథమిక హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై యువత, పట్టభద్రులలో అవగాహన ఉండాలని ఆయన కోరారు.
    ​ఈ కార్యక్రమంలో బాలరాజు, రాకేష్ తదితర పార్టీ నాయకులు మరియు స్థానిక పట్టభద్రులు పాల్గొన్నారు.