Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేతలే నీ ఆయుధం

    Author VENKATESH | 16 Oct 2026, 07:25 PM | కరీంనగర్
    చేతలే నీ ఆయుధం

    వట్టి మాటలు కట్టి పెట్టి
    గట్టిమేలు తలపెట్టవోయ్
    అన్న గురజాడ అప్పారావు
    వాక్యను స్పూర్తిగా తీసుకొని
    యువత మెరుగైనసమాజ
    నిర్మాణంలో చోదక శక్తిగా
    ఎదుగాలి
    మాటలు నీటి మీదిరాతలు కావద్దు
    నీ చేతలే నిన్ను చరిత్రలో నిలుపు
    తాయి పిరికివాడు మాటలతో
    కోటలు కడతాడు వీరుడు తన
    చేతతో సమాజానికి దశ నిర్దేశం
    చేస్తాడు
    వ్యక్తుల మాటలు పలికే
    ఉత్తర కుమారులు కావద్దు
    బతుకులను ఉద్ధరించే
    ధీరులు కావాలి
    చేతలు లేని బతుకు ఒక
    బతుకవుతుందా?
    వేదికలపై ఉపన్యాసాలు ఇవ్వడం
    కాదు కష్టాల్లో ఉన్నవాడిని
    గుండెకు అత్తుకునే వాడే
    అసలైన మనిషిమాటల గారడీ
    వద్దు గట్టి మేలుయే ముద్దు
    ఎదుటి వాడి కన్నీళ్లు తుడిచే
    నీహస్తం
    వేల మంది దేవుళ్ళ గుడుల
    కంటే మహా పవిత్రం
    ధనముందని గర్వపడకు
    పదవులున్నాయని విర్రవీగకు
    కాల చక్రంలో అన్ని బూడిద
    పోసిన పన్నీరే
    నువ్వు పంచిన ప్రేమ నువ్వు
    చేసిన సాయం
    నువ్వు వెళ్ళిన తర్వాత
    నీ పేరును ఇక్కడ నిలిపేది
    ఓ యువతా !లెమ్ము
    మేలుకో దేశాన్ని ఏలుకో
    నీ ఆశయాల అమలు
    చేతల్లోచూయించు
    చీకటిని తిడుతూ కూర్చోవడం
    చేతకాని తనం
    నీ చేతుల్లో చిన్న దీపాన్ని
    వెలిగించడమే వీరత్వం
    పుట్టుకతో ఎవరికి కిరీటాలు రావు
    చచ్చేటపుడు సంపదలు
    వెంటరావని గుర్తుంచుకో
    నువ్వు చేసిన చేతలే
    నీఅసలైన గెలుపు నీ ఆయుధం
    గొప్పతనం కొంటె దొరకదు
    మన సత్కర్మల ద్వారా శాసించి
    సంపాదించుకునే గౌరవం
    మన చేతలతో సమాజానికి
    సమాధానం.చెప్పినపుడే
    మన జన్మకు సార్ధకత
    లేవండి !మేల్కొండి?
    గమ్యం చేరేవరకు విశ్రమించకండి.
    మాటలు చెప్పే సోమరిపోతులు
    మనకు వద్దు. చేతల్లోచూపే
    వీరులు కావాలి. మీ చేతలతో
    మీ భవిష్యత్తును ఈ దేశ
    భవిష్యత్తును మలుచుకోండి
    స్వామి వివేకానంద.
    ఒక చెట్టు ఎలాంటిదో దాని
    ఫలాలను బట్టి తెలుస్తుందనే
    విషయం గుర్తుంచుకోండి.
    మీఆలోచనలు బాగుండొచ్చు
    ఉత్సాహం ఆనందాన్నివ్వచ్చు
    కలలు కనడం ఎంతో సంతోషాన్ని
    కలిగిస్తుండొచ్చు కానీ అసలైన
    గొప్పతనం మీరు నిజంగా చేసే
    పనుల్లోనే ఉంటుంది.
    మాటలతో చెప్పే కంటే
    నిశ్శబ్దంగా సాధించే విజయాలే
    మీసామర్థ్యానికి నిదర్శనం
    మాటల మనుషులు కాకుండా
    చేతలతో చరిత్ర సృష్టించే ఖర్మ
    యోగులుగా మనమంతా
    ముందడుగు వేద్దాం.
    శ్రమ యేవజయతే
    జాతీయ జీవన విధానం
    కావాలి.
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    తెలంగామ ఎకనామిక్ ఫోరం
    ఆర్థికవేత్త రచయిత కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771