Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు..

    Author VENKATESH | 16 Oct 2026, 04:12 PM | ANDHRA PRADESH
    ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు..

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల కేంద్రం వద్ద కూటమి, వైసీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పుంగనూరులో వైసీపీ , కూటమి శ్రేణుల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రాగా ఇరువరు దాడులకు దిగారు.వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. నామినేషన్‌ కేంద్రం వద్ద నుంచి మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఫోన్‌లో మిథున్‌రెడ్డిని పరామర్శించారు. టీడీపీ నాయకులు పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.