Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నేదునూరి పిలుపు

    Author VENKATESH | 15 Oct 2026, 07:56 PM | కరీంనగర్
    నేదునూరి పిలుపు

    మన నియంత్రణలో లేని
    వాటి గురించి ఆలోచించవద్దు
    ఉత్తమ ప్రయత్నమే ముద్దు
    జీవితం ఒక ప్రయాణం
    గెలుపు ఓటములు
    చీకటి వెలుగులు
    ఉత్థాన పతనాలు
    సుఖ దుఃఖాలు సహజం
    మన ఆధీనంలో ఉన్న
    విషయాల మీద పట్టు
    ఉండాలి ఇతరుల మానసిక
    స్థితిపై మనం పట్టు
    సాధించాలనుకోవడం అంటే
    నేలను విడిచి సాము చేయడమే
    యువత దేశానికి వెన్నముఖ
    రేపటి సమాజ భవిష్యత్తు
    యువత ఆలోచనపై ఆధారపడి
    ఉంటుంది కాలం మనచెతుల్లో
    లేదు కానీ కష్టం మన చేతుల్లో
    ఉంది ఫలితం గురించి
    భయపడకుండా లక్ష్యం వైపు
    అడుగులు వేయాలి
    నిన్నటి రోజు గడిచిపోయింది
    రేపటి కాలం దాగివుంది
    చేతిలో లేని ఆ రేపటి గురించి
    చింతలు వద్దు
    ఆకాశంలో మేఘాల గమనం
    ఆగిపోని కాల చక్ర భ్రమణం
    మన చేతుల్లో ఏముంది గనుక
    వృధాగా మనసును మార్చకు
    వెనుకకు నెగెటివ్ ఆలోచనలకు
    పలకాలి స్వస్థి సంకల్పానికి
    సంసిద్ధం కావాలి
    ఓ యువతరమా !మేల్కొనుమా?
    సోమరితనాన్ని వీడాలి
    ఆలోచనల భారాన్ని పక్కన బెట్టు
    నీ శక్తి నంతా పనిలో పెట్టు

    సమయమే సంపధ
    చే జారితే తిరిగి రాదు
    నిరాశల చీకటిని చీల్చుకుంటూ
    ఆశల దీపమై వేలుగాలి నువ్వు

    అనుకున్న లక్ష్యం చేరాలంటే
    నిరంతరం పోరాటం సాగించాలి
    ఫలితం గురించి భయపడవద్దు
    నీ ఉత్తమ ప్రయత్నమే నీకు ముద్దు

    లేవండి మేల్కొండి గమ్యం చేరే
    వరకు విశ్రమించకండి .
    మీ పై మీకు నమ్మకం లేనంత
    వరకు మీరు దేవుడిని నమ్మలేరు.
    స్వామి వివేకానంద.

    ఇవి కూడా చదవండి

    మన ఆధీనంలో లేని విషయాలను
    వదిలేసి మనం చేయగల పనుల
    మీద దృష్టి పెట్టడమే మంచిది.

    అపజయాలు ఎదురైన అవి నేర్పే
    పాఠాలతో మళ్ళీ ప్రయత్నించాలి.
    నిరంతర శ్రమ మొక్కవోని దీక్ష
    ఉత్తమ ప్రయత్నమే మిమ్మల్ని
    ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి

    దేశ భవిష్యత్తును మార్చే శక్తి
    యువత లోనే ఉంది వికసిత
    భారత లక్ష్య సాధనకై సంసిద్ధ మోదాం
    మారుదాం దేశాన్ని మార్చుదాం.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎడ్యుకేషన్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్ 9440245771