Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ట్రాక్టర్‌ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం..

    Author VENKATESH | 13 Oct 2026, 11:59 AM | మెదక్
    ట్రాక్టర్‌ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం..

    ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి టైరు కింద నలిగి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మెదక్‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాజులగూడెం గ్రామానికి చెందిన పుట్టల సాయిలు (44) ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.స్థానికుల వివరాల ప్రకారం.. గాజులగూడెం గ్రామానికి చెందిన సాయిలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన స్నేహితుడైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఇస్మాయిల్‌తో కలిసి ఎంకెపల్లి గ్రామంలో నూతన ఇంటి నిర్మాణం కోసం పాత ఇంటి మట్టిని తరలించే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో మట్టి తరలింపు జరుగుతుండగా సాయిలు ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడ్డాడు. అదే సమయంలో ట్రాక్టర్‌ టైరు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పాపన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.