Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. యాసంగి సాగు చేయొద్దు

    Author VENKATESH | 11 Oct 2026, 08:04 PM | TELANGANA
    ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. యాసంగి సాగు చేయొద్దు

    ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాలుగా మారే అవకాశం ఉందని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులకు ఎలాగైనా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.రానున్న రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని పొంగులేటి తెలిపారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు అధిగమించవచ్చని అన్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు ప్రజల తాగునీటి అవసరాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.