Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దసరా ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న మోడల్ స్కూల్ రిటైల్ విద్యార్థులు

    Author VENKATESH | 10 Oct 2026, 10:03 PM | నల్గొండ
    దసరా ఇంటర్న్‌షిప్‌లో పాల్గొన్న మోడల్ స్కూల్ రిటైల్ విద్యార్థులు

    దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో రిటైల్ వృత్తి విద్యను అభ్యసిస్తున్న లెవెల్ 3 ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినిలు దసరా సెలవుల సందర్భంగా పీఎం శ్రీ కింద 10 రోజుల పాటు దేవరకొండలోని డిండి క్రాస్ రోడ్ లో గల అంజలి సూపర్ మార్కెట్‌లో ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు.ఈ ట్రైనింగ్‌లో భాగంగా విద్యార్థులు సూపర్ మార్కెట్‌లో వస్తువుల అమరిక, ధరల వివరాలను పరిశీలించడం,బార్‌కోడ్ స్కానింగ్,బిల్లింగ్ విధానం, కస్టమర్లకు మర్యాదపూర్వకంగా సేవలు అందించడం,స్టాక్ నిర్వహణ,వస్తువుల గడువు తేదీలను తనిఖీ చేయడం వంటి అంశాల గురించి ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. అలాగే,కస్టమర్లతో కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, సమయపాలన,పరిశుభ్రత,బాధ్యతాయుతంగా పని చేయడం వంటి నైపుణ్యాలను నేర్చుకున్నారు.అంజలి సూపర్ మార్కెట్ సిబ్బంది విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించారు.ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులకు రిటైల్ రంగంలో ప్రత్యక్ష పని అనుభవం లభించింది. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను పొందడానికి అవసరమైన ప్రాక్టికల్ పరిజ్ఞానం,ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది.
    విద్యార్థుల కోసం ఈ అవకాశాన్ని ఇచ్చిన అంజలి సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఒకేషనల్ ట్రైనర్ బెజవాడ శంకరయ్య స్కూల్ తరుపున ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీజీటీ కొర్ర శిరీష,రాంకుమార్,ఒకేషనల్ ట్రైనర్ బెజవాడ శంకరయ్య, సూపర్ మార్కెట్ యాజమాన్యం,ట్రైనింగ్ విద్యార్థినిలు రిషిత, యోగిత, శ్రీలత,సింధురాణి,సూపర్ మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు