Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు.. ఘనంగా గోల్డ్ మెడల్ కమిటీ సమావేశం!

    Author VENKATESH | 09 Oct 2026, 08:27 PM | నల్గొండ
    దేవరకొండ డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు.. ఘనంగా గోల్డ్ మెడల్ కమిటీ సమావేశం!

    దేవరకొండ,09అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, దేవరకొండలో శుక్రవారం (09-10-2026) మహిళా సాధికారత కేంద్రం (WEC), NSS యూనిట్లు I & II ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాలలోని బి.ఏ., బీకాం, బి.జెడ్.సి., ఎంపీసీఎస్, హెల్త్ కేర్ తదితర విభాగాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను తయారుచేసి, వాటి చుట్టూ సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. కళాశాల ప్రాంగణం తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా మారింది.అలాగే కళాశాలలో ఈరోజు గోల్డ్ మెడల్ డోనర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 29/ 10/ 2026 రోజున గోల్డ్ మెడల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానం చేశారు. తదనంతరం గోల్డ్ మెడల్ సెక్రటరీ, సభ్యులు లయన్ సముద్రాల ధనుంజయ ,నమ్మికంటి గౌరీ శంకర్, గాజుల రాజేష్, బెజవాడ శేఖర్ ,మోర భీష్మాచారి, తదితరులు ఈ బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొని ఉత్సాహంగా విద్యార్థులతో పాటు బతుకమ్మ పాటలకు ఆడి పాడి అలరించారు.
    ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంతో, ప్రకృతితో ముడిపడి ఉన్న గొప్ప సాంస్కృతిక సంప్రదాయమని అన్నారు. పూలను పూజించే ఈ పండుగ ప్రకృతి పట్ల మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, పండుగల విశిష్టతను తెలుసుకోవడం ఎంతో అవసరమని తెలిపారు.
    బతుకమ్మ వంటి సాంస్కృతిక ఉత్సవాలను కళాశాల స్థాయిలో నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతిపై అవగాహన, ఐక్యతా భావం, సృజనాత్మకత పెంపొందుతాయని ప్రిన్సిపాల్ అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.విద్యార్థుల ఆటపాటలు, బతుకమ్మల సందడి మధ్య ఉత్సవాలు ఆనందోత్సాహాలతో కొనసాగి, కళాశాలలో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాయి.
    ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ మరియు NSS యూనిట్–II అధికారి సి. లింగమయ్య, COE లింగారెడ్డి, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ కె. పృథు, WEC సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రేణుక, డాక్టర్ వి. మకట్లాల్, డాక్టర్ ఎం. ప్రభాకర్, ప్రెస్ కోఆర్డినేటర్ ఎ. శ్రీను, బి. సురేష్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.