Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జడ్పీహెచ్ఎస్ గుడిపల్లిలో విద్యార్థులకు యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ పంపిణీ

    Author VENKATESH | 09 Oct 2026, 08:23 PM | నల్గొండ
    జడ్పీహెచ్ఎస్ గుడిపల్లిలో విద్యార్థులకు యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ పంపిణీ

    ​- ఘనంగా నిర్వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్
    - విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలి: సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి
    దేవరకొండ,09అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమ కార్యక్రమం గుడిపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం గుడిపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్ యూనిఫామ్, షూస్, టై, బెల్ట్‌లను పంపిణీ చేశారు.
    ​ఈ కార్యక్రమానికి గుడిపల్లి గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు స్వయంగా వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారిని ఉత్తమ పౌరులుగా మరియు క్రమశిక్షణతో మెలిగేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని, గుడిపల్లి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌కు జిల్లా స్థాయిలో మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
    ​ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత నరసింహ, గ్రామ ఉపసర్పంచ్ అర్వపల్లి శ్రీను, వార్డు సభ్యులు ఎర్ర వంశీకృష్ణ, బోడ నాగరాజు, కత్తుల రమేష్, వట్టేపు శ్రీను, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.