Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ వీధుల్లో బతుకమ్మ శోభ.. ఉత్సాహంగా VDS మహిళల వేడుకలు

    Author VENKATESH | 09 Oct 2026, 08:17 PM | నల్గొండ
    దేవరకొండ వీధుల్లో బతుకమ్మ శోభ.. ఉత్సాహంగా VDS మహిళల వేడుకలు

    దేవరకొండ,09అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు దేవరకొండలో సందడిగా సాగాయి. విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలు ఆటపాటలతో దద్దరిల్లాయి. జాతీయ అవార్డు గ్రహీత, బెస్ట్ సర్వీస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ బాషా చౌహన్ ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించారు.
    ​VDS కార్యాలయంలో ఉచిత శిక్షణ పొందుతున్న మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. అనంతరం తెలంగాణ సాంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లతో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మ దీవెనలు కోరుకుంటూ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.
    ​ఈ సాంస్కృతిక వేడుకల్లో శిక్షణార్థులు ఎన్. శాంతి, బి. నిహారిక, లహరి, స్వప్న, సంతోష, స్వాతి, కవిత తదితర మహిళలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.