Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ

    Author VENKATESH | 09 Oct 2026, 12:18 PM | ANDHRA PRADESH
    బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న గొడ్డలి పార్టీ

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ స్పష్టం చేశారు. చట్టపరంగా బీసీలకు న్యాయం చేయలేకపోయినా, పార్టీ పరంగా వారికి న్యాయం చేస్తామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. బీసీల రాజకీయ ఎదుగుదలకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బీసీలకు పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు.బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగకూడదని కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. అందుకే వారికి 34 శాతం రిజర్వేషన్లు దక్కకుండా న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారంటూ జగన్‌పై మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని పునరుద్ఘాటించారు.