Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సేవయే ఆనందానికి రాజమార్గం

    Author VENKATESH | 08 Oct 2026, 07:55 PM | కరీంనగర్
    సేవయే ఆనందానికి రాజమార్గం

    కంటి తుడుపు కాదు కావలసింది
    కన్నీరు తుడిచే కరుణ కావాలి
    స్వార్థం వీడిన ప్రతి అడుగులో
    పరమార్ధం వెతికే గుణం ఉండాలి
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    ఆకలితో అలమటించే ప్రాణికి
    అన్నంపెట్టే హృదయమే దైవం
    అనాథగా మిగిలిన జీవితానికి
    అండగా నిలిచే హస్తమే జీవనం
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    ఒత్తిడి వద్దు ఓపికయే ముద్దు
    నేడు ప్రతికూలబావాల నియంత్రణ
    పద్ధతుల పట్ల అవగాహన లేదు
    పాజిటివ్ ఆలోచనల ప్రస్తావనేలేదు
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    డెంటల్ హైజీన్ అంటే పళ్ళు
    తోముకోవడం చిన్నప్పుడే
    నేర్పుతారు కానీ మెంటల్
    హైజిన్ అంటే మనసును
    ఎలా శుభ్రం చేసుకోవాలో మరిచి
    పోతున్నాం నేర్పేవాళ్ళులేరు నేర్చుకునే వారులేరు ఆందోళనా
    పథమే మార్గమైంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమై
    ఒంటరి కుటుంబాల సంఖ్య పెరిగి
    మనో వ్యాకులత విస్తరిస్తుంది
    మనసు శుభ్రతకు మంచిమాటలే
    సాథనం కలిమిడియె కులాసా
    సేవయే ఆనందానికి రాజమార్గం
    ఇంట్లో పెద్ద దిక్కు కరువైంది
    అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య
    బాబయ్య మామయ్యల
    ఓదార్పులు ఆత్మీయత కరువైంది
    ఆంథొళన వరమైంది అందరు
    ఉండి అనాథలై ఆక్రందనలే
    ఆస్తులైనాయి ఒంటరి తనమే
    తోడైంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    మానవీయ సామాజిక విలువలకు తిలోదకాలు ఇవ్వడంలో పోటీ
    పెరిగింది పోలికత్వం పోటీ తత్వం
    జీవన తత్వం అయింది
    కుళ్ళు కుతంత్రాలు సమాజ తంత్రమైంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    మాట్లాడని వారే బంధువులైనారు
    సోషల్ స్టేటస్ అనే ఫోబియా రోగం
    ముదిరి రక్త సంబథీకుల మధ్య తగాదాలుహత్యలు ఆత్మహత్యలు
    సామాజిక లక్షణమైంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    పదవుల అండతో వచ్చేది కాదు
    పది మందికి మేలు చేస్తే వచ్చేది కీర్తి ధనముతో కొనలేని పరమానంధం
    ఆపన్నుల సేవా బావములోనే ఉంది సామాజిక స్పూర్తి
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    ధ్యానం శ్వాస క్రియ మనసును ప్రశాంతంగా వుంచుతుంది
    ఆధ్యాత్మికతతో అంతర్గత ఆనందం చేకూరుతుంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    ఆనందం రెండు రకాలు పొందడం వల్ల కలిగేది ఇవ్వడం వల్ల కలిగేది
    ఇవ్వడం వల్ల కలిగే ఆనందం సంతోషాన్ని ఎక్కువ సంతృప్తిని
    ఇస్తుంది పొందడం వల్ల కలిగే ఆనందం కృతజ్ఞతను ఇస్తుంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    కలిగిన ఆనందాన్ని ఇష్టమైన వారితో పంచుకుంటాం ఇది పరిణితి చెందిన ఆనందం
    ఇవ్వడం పంచుకోవడంద్వారా కలుగుతుంది ప్రతి వ్యక్తి తీసుకునే
    స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగడమనేది మనసును పరిశుధ్ధం చేసి అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    సమాజ మార్పుకు నడుం బిగించి
    చైతన్య దీపమై ముందుకు సాగుదాం మానవసేవయే
    మాధవ సేవగా ఎంచుకొని
    జనహితమే పరమావధిగా
    సాగుదాం నిజమైన సంతోషాన్ని
    సొంతం చేసుకుందాం
    సేవయేఆనందానికి రాజ మార్గం
    కుంగుబాటుకు కంగారు పడక
    ఇతరుల కోసం సేవ చేయడం
    మీలో విప్లవాత్మక మార్పు
    తెస్తుంది సేవ మనలో చైతన్యం
    తెస్తుంది సేవే జీవిత లక్ష్యమైతె
    భయాన్ని తొలిగించి
    జీవితానికి ఒక అర్ధాన్నిస్తుంది
    మనసు ప్రశాంతత పొందుతుంది
    ఇతరుల మానసిక స్థితి మెరుగు
    పరచడమే‌ సేవకు అత్యుత్తమ
    రూపం ఈ సమాజానికి మనం
    ఎలా ఉపయోగపడగలం
    ప్రశ్నించుకుందాం?
    సేవలో నిమగ్నమౌదాం
    మానవ సేవయే మాథవ సేవ
    మన జీవన శైలిలో భాగం కావాలి
    సేవయే ఆనందానికి రాజ మార్గం
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    ఫ్రీలాన్స్ రైటర్
    రచయిత 'కాలమిస్ట్
    కరీంనగర్
    9440245771