Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దసరా సెలవుల వేళ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!

    Author VENKATESH | 08 Oct 2026, 12:39 PM | TELANGANA
    దసరా సెలవుల వేళ ప్రయాణీకులకు బిగ్ అప్డేట్..!!

    దసరా సెలవుల్లో ప్రతీ ఏటా రైళ్లు.. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో రాకపోకలు జరుగుతాయి. రెండు నెలల ముందుగానే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఇబ్బంది కనిపించటం లేదు. అనేక రైళ్లలో భారీగా వెయిటింగ్​ లిస్ట్​ కనిపిస్తోంది. బుధవారం నాటి పరిస్థితి చూస్తే టికెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ప్రధాన స్టేషన్లు కాచిగూడ, సికింద్రాబాద్​, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లిను వెళ్లే చాలా రైళ్లలో భారీగా టికెట్​లు బుక్​ అయ్యాయి. అయితే గత కొన్నిరోజులుగా బుకింగ్​ చేసుకుంటున్న వారికి మాత్రం వెయిటింగ్​ లిస్ట్​ వస్తోంది. రైల్వే అధికారు లు పలు రైళ్లల్లో ఖాళీలు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. అయితే, రిజర్వేషన్ కోసం ప్రయత్నం సమయంలో వెయిటింగ్ లిస్టు కనిపిస్తోంది. దీంతో.. ప్రయాణీకుల్లో ఆందోళన కనిపిస్తోంది. వెయిటింగ్​ లిస్ట్​ తగ్గి టికెట్​ దొరుకుతుందని చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఆ రోజున తిరుమలకు వాహనాలకు నో ఎంట్రీ - 10 నిమిషాల్లో 60 వేల టికెట్లు..!! సెలవుల్లో పెరుగనున్న రద్దీ కాగా, దసరా రద్దీ వేళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ప్రకటించింది. దాదాపు ఏడు వేల స్పెషల్ సర్వీసుల ను నడపాలని నిర్ణయించింది. రీజియన్ల వారిగా అన్నీ జిల్లాలకు బస్సులను ఏర్పాటు చేశారు. అధికంగా కరీంనగర్ జోన్ నుంచి మొత్తం 3533 బస్సులు నడపనుంది. కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే హైదరాబాద్​ నగర పరిధిలో వారి వద్దకే బస్సు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ప్రకటించింది. అయితే, ఎక్కువ శాతం ప్రయాణీకులు రైళ్లల్లో గమ్య స్థానాలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కాగా.. రైళ్లల్లో మాత్రం వెయిటింగ్ లిస్టు పెరిగి పోతోంది. దీంతో.. మరిన్ని అదనపు రైళ్ల కోసం వేచి చూస్తున్నారు.